Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ అపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు నిందితులు హైదారాబాద్ కి చెందిన వాళ్ళే అని తేలింది. వందలాది ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లను టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతోనే ఇప్పటికే కొందరు యువతీ యువకులు పాస్ పోర్ట్ లు తీసుకున్నారు.
Read Also: Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
కాగా, గెజిటెడ్ ఆఫీసర్స్ పేర్లతో నకిలీ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు ఎలగం రాజ్ కుమార్, మహబూబ్, రాచమల్ల విజయ లక్ష్మీ, కూరపాటి పల్లవి, బండి శంఖర్, గిరిరాజ్ అనిల్ కుమార్ అనే నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కి చెందిన ఎలగం రాజ్ కుమార్ 10 ఏళ్లుగా ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇతని దగ్గర రాచమల్ల విజయ లక్ష్మి, పల్లవి పనిచేస్తున్నారు.. తన ఆన్లైన్ సెంటర్ లో ఇద్దరు మహిళల సహాయంతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నాడు.. ఫేక్ ఆధార్ కార్డ్ లు, ఫేక్ ఓటర్ ఐడి, ఫేక్ పాన్ కార్డ్ లతో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తున్నారు.. ఫేక్ ఓటర్ కార్డులతో ఆధార్ కార్డుల్లో అడ్రస్ చేంజ్ లాంటివి చేస్తున్నారు.. అధికారులకు తెలియకుండానే.. వాళ్ళ పేర్ల మీద నకిలీ స్టాంప్ లు తయారు చేసారని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు.
Read Also: Hoax Bomb Threat: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
అలాగే, మహబూబ్ అనే వ్యక్తి సర్వశిక్ష అభియాన్ లో కాంట్రాక్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. స్కూల్స్ లో మాత్రమే ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు ఉంటే చేసే అధికారం ఉంది. కానీ, అనధికారికంగా రాజ్ కుమార్ కి చెందిన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కి కూడా పనులు చేసి పెట్టాడని పేర్కొన్నారు. వీళ్ళకు పాస్ పోర్ట్ లు ఇప్పించే ఏజెంట్ బండి శంకర్ పరిచయం అయ్యాడు.. పాస్ పోర్ట్ కోసం తన దగ్గరికి వచ్చిన వాళ్లకు.. రాజ్ కుమార్ ముఠా సహాయంతో నకిలీ సర్టిఫికెట్లతో పాస్ పోర్ట్ లు ఇప్పించాడన్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే గిరిరాజ్ అనిల్ కుమార్ కూడా ఈ ముఠాలో జాయిన్ అయ్యాడని చెప్పారు. ఇతను ఫేక్ ఓటర్ కార్డులు తయారు చేసి ఇచ్చాడు అని వెల్లడించారు. అయితే, ఇప్పటి వరకు15 వేల ఓటర్ కార్డులు, 10 వేల ఆధార్ కార్డులు, 50 పాస్ పోర్టులు, రెండు వేల బర్త్ సర్టిఫికెట్లు, 1500 పాన్ కార్డులను ఈ ముఠా తయారు చేసిందని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర చెప్పుకొచ్చారు.