Priyank Kharge: ‘‘ఖర్గే ఫ్యామిలీపై రజాకార్ దాడి’’.. యోగి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- యోగి ‘‘రజాకార్’’ వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే కుమారుడు..
- తన తండ్రి వ్యక్తిగత విషాదాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్న ప్రియాంక్ ఖర్గే..
- మల్లికార్జున ఖర్గే.. యోగి మధ్య మాటల యుద్ధంపై ప్రియాంక్ ఖర్గే కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyank Kharge: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గతాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం హయాంలో అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని ఖర్గే గ్రామంపై రజాకార్లు దాడి చేసి, ఖర్గే ఇంటిని కాల్చిన సంగతిని గుర్తు చేశారు. ఈ ఘటనలో ఖర్గే తల్లితో పాటు ఆయన కుటుంబం కూడా మరణించారు. ఈ విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెబుతూ.. తన కుటుంబ త్యాగాన్ని మరిచి ఖర్గే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వ్యక్తిగత విషాదాన్ని ‘‘రాజకీయ లబ్ధి’’ కోసం
తన తండ్రి ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. ‘‘సాధువుల వేషంలో ఉన్న వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’’ అని మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా యోగి ‘‘రజాకార్ దాడి’’ గురించి గుర్తు చేశారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
Read Also: Alexei Zimin: రష్యా సెలిబ్రిటీ చెఫ్, పుతిన్ విమర్శకుడు అనుమానాస్పద మృతి..
ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ విషాద ఘటనలో తన తండ్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, 9 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రి, ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారని అన్నారు. ‘‘ఈ విషాదం జరిగినప్పటికీ, ఖర్గే ఎప్పుడూ దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. బాధితుడిని అని ఎప్పుడూ సింపతీ కోసం ట్రై చేయలేదు.’’ అని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఖర్గే కుటుంబంపై దాడి చేసింది రజాకార్లు, మొత్తం ముస్లిం సమాజం కాదని కర్ణాటక మంత్రి అన్నారు.
బుద్ధుడు-బసవన్న-అంబేద్కర్‌ల విలువలను కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 82 ఏళ్ల కాంగ్రెస్ అధినేత అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రియాంక్ ఖర్గే అన్నారు. యోగి జీ మీ ద్వేషాన్ని వేరే చోటుకి తీసుకెళ్లండి, రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విద్వేషాన్ని నాటడానికి ప్రయత్నించే బదులుగా పీఎం మోడీ అభివృద్ధిపై చర్చించి గెలవండి అంటూ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?