BRS MLAs Meet CM Revanth: తెలంగాణ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పద్మారావు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో అరగంటకు పైగా ఇద్దరు భేటీ అయ్యారు. ఇక, సమావేశం తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, పద్మారావు మీడియాతో చిట్ చాట్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్య కోసం సీఎం దగ్గరకు వెళ్ళాం.. మేము వెళ్లేసరికి సీఎం రూమ్ నిండా మంది ఉన్నారు.. 15 నిమిషాల పాటు రేవంత్ రెడ్డితో ఏమి మాట్లాడలేదు.. ఆ తర్వాత పద్మారావు నియోజకవర్గంలో కేసీఆర్ మంజూరు చేసిన హై స్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలి కోరాం.. సీఎం వెంటనే వేం నరేందర్ రెడ్డికి ఓ పేపర్ ఇచ్చి చేయమని చెప్పారు.. పద్మారావు రమ్మన్నాడు అని నేను కూడా వెళ్ళాను అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Engineer Rashid: కాశ్మీర్ ఎంపీ ఇంజనీర్ రషీద్‌కు బెయిల్ తిరస్కరణ..
ఇక, డీ లిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన మీటింగ్ ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు. చెన్నైలో జరిగే మీటింగ్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయట్లేదు అని వెల్లడించారు. డీఎంకే పార్టీ వాళ్ళు పిలిచారు అని మేము వెళ్తున్నాం.. డీఎంకే మాకు ఫ్రెండ్లీ పార్టీ అని పేర్కొన్నారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్ కమిటీ నివేదిక గురించి నాకు తెలియదు.. అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు గుర్తు లేదు అని తేల్చి చెప్పారు. అలాగే, వీరితో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్యామిలీ సైతం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మెడికల్ కాలేజీ సీట్ల పెంపు కోసం ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు.