Jio Vs Airtel: భారతదేశంలో టెలికాం రంగంలో ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో కంపెనీలు అగ్రగామిగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కంపెనీలు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అలాంటి ప్లాన్లలో రూ.1199 ప్లాన్ ఒకటి. ధర ఒకటే అయినా ఇందులో అందించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. మరి మీకు ఏ కంపెనీ అందిస్తున్న ప్లాన్ ఉత్తమమో ఒకసారి చూద్దాం.
Read Also: Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్ హీరో?
ముందుగా జియో అందిస్తున్న రూ.1199 ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఈ ప్లాన్ లో 84 రోజుల కాల పరిమితి వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్ సదుపాయం ఉంది. అయితే, డేటా పరంగా చూస్తే, రోజుకు 3GB చొప్పున మొత్తం 252GB డేటా లభిస్తుంది. అలాగే, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G ఫోన్ వాడుతున్న వారికి అపరిమిత 5G డేటా కూడా లభిస్తుంది. అదనంగా, జియో టీవీ (JioTV), జియో క్లౌడ్ (JioCloud) వంటి ప్రత్యేక సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.
ఇక మరోవైపు ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.1199 ప్లాన్ చూస్తే.. వినియోగదారులకు ఇందులో కూడా 84 రోజుల కాల పరిమితి లభిస్తుంది. అలాగే అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. డేటా పరంగా చూస్తే, రోజుకు 2.5GB చొప్పున మొత్తం 210GB డేటా లభిస్తుంది. ముఖ్యంగా, 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G ఫోన్ వాడుతున్న వారికి అపరిమిత 5G డేటా కూడా అందించబడుతుంది. అయితే జియో కంటే 42GB తక్కువగా అందిస్తుండం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా, వినియోగదారులకు రోజుకు 100 SMSలు ఉచితంగా లభిస్తాయి. అదనంగా, 22 కంటే ఎక్కువ ఓటీటీ (OTT) వేదికలకు ఉచితంగా యాక్సెస్ ఉంటుంది. స్పామ్ కాల్స్ నియంత్రణ, SMS అలర్ట్స్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.
Read Also: Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇక ఈ రెండు కంపెనీలు ధర విషయంలో రూ.1199 ఒకేలా ఉన్న అవి అందించే సేవలు వేరేలా ఉన్నాయి. వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, రోజువారీ SMSలు రెండింట్లోనూ ఒకే విధంగా ఉన్నాయి. కానీ, డేటా పరంగా చూస్తే, జియో ప్లాన్ రోజుకు 3GB అందిస్తుండగా, ఎయిర్‌టెల్ ప్లాన్ రోజుకు 2.5GB మాత్రమే అందిస్తోంది. అంటే, మొత్తం 42GB అదనంగా జియో ప్లాన్‌లో అధికంగా లభిస్తుంది. మరోవైపు, ఎయిర్‌టెల్ ప్లాన్ 22 కంటే ఎక్కువ ఓటీటీ (OTT) యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఇందులో ఉంది. అయితే, జియోలో మాత్రం ఈ ఓటీటీ ప్రయోజనాలు లభించవు. కాబట్టి మీ అవసరాలను బట్టి, సరైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ డేటా కావాలనుకునేవారు జియో రూ.1199 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అదే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్, అదనపు సేవలు కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్ ఉత్తమం.