Protest : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్‌జెండర్లు మరియు ట్రాఫిక్ అసిస్టెంట్లు కలిసి నిరసన చేపట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమను అవహేళన చేయడం అనైతికమని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “50 మంది ట్రాన్స్‌జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాం” అని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేస్తుండగానే బీఆర్ఎస్‌కు చెందిన…
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్‌లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పార్లమెంట్‌లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు.
ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్‌తోనే ఉన్నా పద్మారావు గౌడ్‌కు 60 వేల మెజార్టీ ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పద్మారావు గౌడ్ కేసీఆర్‌కు తమ్ముడి లాంటి వారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్ మండి డివిజన్‌లలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు.