నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కాగా, నూతన జోనల్ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. నూతన విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయని.. సీనియర్ల సంగతి సరే.. మరి జూనియర్ల పరిస్థితి ఏంటి? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.