మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి...భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో...రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది.
మణిపూర్‌లో బుధవారం కీలక పరిణామం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. గత ఫిబ్రవరి 13న ఎన్.బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
HYDRAA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తన గుర్తింపులో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇంతకు ముందు ఈవీడీఎం (EVDM) లోగోను వినియోగిస్తున్న హైడ్రా, ఇకపై కొత్త లోగోతో తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ మార్పు సంస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ గుర్తింపు పెంచేలా ఆకర్షణీయంగా రూపుదిద్దబడింది. హైడ్రా యొక్క కొత్త లోగోలో “హెచ్” అక్షరంపై నీటి బొట్టు ఆకృతిని చేర్చారు. ఈ రూపకల్పన నీరు, పరిరక్షణ, , ప్రభుత్వ…
కడప కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కడప ఎమ్మెల్యే మాధవి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కంప్లంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
Bangladesh : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేదు. అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రాను రాను ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది.
తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కృష్ణా జలాల విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ WP1230/2023 నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వాదులతో కలిసి విచారణకు…
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్‌టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో జీఎస్‌టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్‌లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
Sabitha Indra Reddy: మొత్తం 12 వేల స్కూల్స్ మూత పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదు లక్షల విద్యాబరోసా ఇస్తా అన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ, ఎందుకు 2 లక్షలు తగ్గింది? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
“మన రోడ్లను నిర్మించింది మన సంపద కాదు... మన సంపదను నిర్మించింది మన రోడ్లు” అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి అన్నారు. ఒక దేశాభివృద్ధిలో రహదారుల ఎంత కీలకమో ఆయన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ ఏడాది క్రితం కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. మండలాల నుంచి జిల్లాలను కలిపే రహదారులు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానిని కలిపే రాష్ట్ర రహదారులు, వివిధ జిల్లాల మీదుగా ప్రయాణించే జాతీయ…