ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురును అందించింది. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులంటే హుందాతనంగా, జవాబుదారీగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వెర్రి వేశాలు వేస్తే విలువ పోతుంది. ఇదే రీతిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రామ్ లో బ్రేక్ డ్యాన్సులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన…
ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ టీమ్స్ లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించింది. సంస్థలోని ఓ వ్యక్తి ద్వారా లేఆఫ్స్ విషయం బయటకు వచ్చినట్లు జాతీయ మీడియా తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో.... వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి లో పౌర సేవలు మరింత ఈజీ అవడం కావడం కోసం ఉద్యోగుల ప్రమోషన్ చానెల్స్ లో మార్పుకోసం చేసింది ప్రభుత్వం. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..ఇక నుంచి సింగిల్ కేడర్ గానే ఎంపీడీఓ డీఎల్పీఓలను మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఎంపీడీఓల రిక్రూట్మెంట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది.
కంపెనీ ఐదు రోజుల రిటర్న్-టు-ఆఫీస్ (RTO) పని విధానాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగులు చేసిన వినతులను జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ తిరస్కరించారు. ఉద్యోగులు వేసిన అంతర్గత పిటిషన్‌ను అతడు తోసిపుచ్చారు. దానిపై సమయం వృథా చేయకండి.. ఆ ఫకింగ్ పిటిషన్‌పై ఎంత మంది సంతకం చేశారనేది నాకు ముఖ్యం కాదు అని చెప్పుకొచ్చారు.
AP Govt : త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. రేపు (ఫిబ్రవరి 17) గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
4-Day Work Week: యునైటెడ్ కింగ్‌డమ్‌లో పని భారాన్ని తగ్గించడానికి అక్కడి కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సుమారు 200 బ్రిటీష్ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ ఎటువంటి జీతం కోల్పోకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ప్రకటించాయి.
బ్యాంకులు కస్టమర్లకు రకరకాల అకౌంట్ లను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. సేవింగ్, కరెంట్, శాలరీ ఖాతాలను ఇస్తుంటాయి. అయితే శాలరీ అకౌంట్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందిస్తుంటాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందుతాయి. కాగా శాలరీ అకౌంట్ల ద్వారా ఆయా బ్యాంకులు కస్టమర్లకు మంచి ప్రయోజనాలను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి బోలెడన్ని ఆఫర్లను అందిస్తోంది. ఆ…