Fire Accident: నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Read also: Palla Rajeshwar Reddy: రేవంత్ రెడ్డికి పల్లా సవాల్.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు చూద్దాం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోజూ ఉదయం పరిశ్రమల పనులను కార్మికులు మొదలు పెట్టారు. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్ లో సాల్వెంట్ ను అన్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా స్పార్క్ రావడంతో ఒకేసారి ట్యాంక్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రొడక్షన్ బ్లాక్ లో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలు, కమ్ముకున్న పొగలతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Read also: Bhatti Vikramarka: టాక్స్ రెవెన్యూ 40 వేలకోట్లా!.. టాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా?
వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు. స్థానిక సమాచారంతో పరిశ్రమ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే మంటలు ఎగిసిపడుతుండటంతో మంటను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది గంటల తరబడి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపుచేసేందుకు రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న మంటలు అదుపులోకి రాకపోడం గమనార్హం. పార్మా కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల తీవ్రత పెరిగితే రియాక్టర్ లు పెలే ప్రమాదం ఉందంటున్న అధికారులు. చుట్టుపక్కల కంపెనీల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు.
Family Man 3: హోలీకి ‘ఫ్యామిలీ’తో శ్రీకాంత్ వస్తున్నాడు…