నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.