తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా వేయలేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల 10 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం బహిరంగంగా వెల్లడైన సంగతి తెలిసిందే.
తెలంగాణ వ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తున్నారు. ఈ టైంలో ఆ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలతో పాటు…వాళ్లపై కంప్లయింట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారట. అసలు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.. ఇప్పుడు వాళ్లకొచ్చిన ఆ కష్టమేంటి? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ల దగ్గర నుంచి వివరాలు…
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా ప్రకటించిన సీఎం, అసెంబ్లీ సభ్యులు ఎవరూ ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ, ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై…
Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ధర్మాసనాల పూర్వపు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాల్లో ఎప్పటిలోగా తేల్చాలని స్పష్టంగా చెప్పలేదన్నారు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
KCR: నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు గులాబీ బాస్. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండటంతో కేసీఆర్ ఇవాళ శాసనసభా సభ్యులు మీటింగ్ ఏర్పాటు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మామూలుగా అయితే... ఇది రొటిన్ వ్యవహారంలాగే అనిపించేదిగానీ... పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడంతో.... పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ.