Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్థాన్‌లోని మురిడ్కేలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మే 7 రాత్రి భారత వైమానిక దళం ఈ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. దాడిలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఇప్పుడు లష్కర్ స్వయంగా JCB యంత్రాలతో కూల్చివేసింది. ఎందుకు ఈ ఉగ్రవాదులు వారి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు. అసలు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Sudershan Reddy : ఆత్మ ప్రబోధంతో ఓటేయండి
Also Read
ఉగ్ర సంస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించిందా?
మే 7న పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:35 గంటలకు భారత వైమానిక దళం మురిడ్కేలోని మర్కజ్ తైబాపై వైమానిక దాడి నిర్వహించింది. గత 25 ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ, వసతి, ఆయుధాలు అందిస్తున్న ప్రదేశం ఇదే. రెండు అంతస్తుల ఈ భవనం ‘ఉమ్-ఉల్-ఖురా’ ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనాల్లో లష్కరే అగ్ర కమాండర్ల కార్యాలయాలు, ఉగ్రవాదుల నివాస గదులు ఉన్నాయి. తాజా ఉగ్ర సంస్థ ఈ శిథిలాలను పూర్తి కూల్చివేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి ఈ ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం దెబ్బతిన్న భవనాలను తన ఖర్చుతో పునర్నిర్మించుకుంటామని ప్రకటించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఆగస్టు 18 నుంచి లష్కరే స్వయంగా JCB యంత్రాలతో శిథిలాలను కూల్చివేస్తుంది. సెప్టెంబర్ 4 నాటికి, ‘ఉమ్-ఉల్-ఖురా’ కూల్చివేశారు. తాజా ఈరోజు ఉదయం ఎర్ర భవనాన్ని కూడా కూల్చివేశారు.
కొత్త నిర్మాణానికి సన్నాహాలు..
లష్కరే తోయిబా 2026లో జరిగే వార్షిక కార్యక్రమానికి ముందు కనీసం ఒక భాగాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని పలు నివేదికలు తెలిపాయి. ఈ పని మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. కసూర్ జిల్లాలోని పటోకిలో ఉన్న ‘మర్కజ్ యార్మౌక్’ వద్ద ఉగ్రవాదులకు తాత్కాలిక శిక్షణ, వసతి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.
READ ALSO: Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!