Krishna Vrinda Viahari Review : కృష్ణ వ్రింద విహారి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Naga Shaurya, Shirley Setia, Radhika Sarathkumar, Vennela Kishore,
- DIRECTOR: Anish R Krishna
- MUSIC: Sagar Mahati
- PRODUCER: Usha Mulpuri
ఇవాళ ఒక సినిమాను జనం దగ్గరకు తీసుకెళ్ళాలంటే రకరకాల టెక్నిక్స్ ఉపయోగించాల్సి వస్తోంది. అలా యంగ్ హీరో నాగశౌర్య తన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’ ని ప్రజలలోకి తీసుకెళ్ళడం కోసం ఏకంగా పాదయాత్రే చేశాడు. అతని పాదయాత్రకు మంచి స్పందనే లభించింది. మరి శుక్రవారం విడుదలైన ఈ సినిమా మాట ఏమిటీ!?
గోదావరి జిల్లాలో సత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు కృష్ణ . వాళ్ళది ఆర్గానిక్ ఫుడ్ ను మాత్రమే వాడేంత ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అలాంటి కృష్ణ ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తాడు. బావ బ్రహ్మాజీ దగ్గర ఉంటూ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరతాడు. అక్కడ తన టీమ్ లీడర్ అయిన వ్రిందతో ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న ఆమెకు కృష్ణ ప్రవర్తన నచ్చుతుంది. అయితే… పెళ్ళికి సంబంధించిన తనకున్న ఓ సమస్యను అతనికి చెప్పి, అందుకు అతను అడ్డు చెప్పకపోవడంతో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. మరి వ్రింద సమస్యను తన కుటుంబ సభ్యులకు కృష్ణ చెప్పాడా లేదా? వాళ్ళు వీళ్ళ పెళ్ళికి అంగీకరించారా లేదా? ఒకవేళ్ళ అందుకు ఓకే అని చెబితే ఆ తర్వాత వారికి ఎదురైన సమస్యలు ఏమిటీ అనేదే ఈ సినిమా!
Also Read
ఇటీవల వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీలో హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవడం కోసం తమలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులకు అబద్ధం చెబుతారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాల మీదనే తర్వాత కథ సాగుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం తన ఆలోచనలకు, అభిరుచులకు పూర్తి భిన్నమైన అమ్మాయిని కృష్ణ ప్రేమించడంతో సాగిపోయింది. అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే మొదలైంది. వ్రిందను పెళ్ళి చేసుకోవడం కోసం కృష్ణ ఆడే నాటకం, దాంతో తల్లి తన కొడుక్కి పెళ్ళైతే చాలురా అనుకోవడం, అదే సమయంలో వీరి కుటుంబ మధ్య ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం… దాని మీదనే ద్వితీయార్థం నడిచింది.
నిజానికి ఈ సినిమాలో పెద్దంత కథ లేదు. ఊహించని మలుపులూ లేవు. ఓ చిన్న పాయింట్ ను తీసుకుని దర్శకుడు రెండు గంటల సినిమాగా తీశాడు. దాంతో ప్రధమార్థం సాగదీసినట్టు ఉంది. తనకు లేని లక్షణాలున్నాయన్న ఒకే ఒక్క కారణంతో హీరోయిన్ తో హీరో ప్రేమలో పడిపోవడం అంత కరెక్ట్ గా అనిపించదు. అలానే ఆఫీస్ మేడ్ లో హీరో పొరపాటున సాగించే ప్రేమాయణం మూవీ లెంగ్త్ ను పెంచడం కోసమనే అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో హీరో స్నేహితులతో పాటు, బ్రహ్మాజీ పండించిన కామెడీ కాస్తంత రిలీఫ్ ను అందిస్తుంది. ఇక ద్వితీయార్థంలో ఇటు భార్యనూ, అటు తల్లినీ కన్వెన్స్ చేయలేక హీరో పడే తిప్పలతో కథ సాగిపోతుంది. అతి క్లిష్టమైన, కీలకమైన సమస్యను ఒకే ఒక్క డైలాగ్ తో హీరో చటుక్కున పరిష్కరించేయడం, ఊరిని శాసించే అతని తల్లికి ఠక్కున జ్ఞానోదయం అయిపోవడం సినిమాటిక్ గా ఉంది. ఫైట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫైట్స్ లా ఉన్నాయి. అయితే ద్వితీయార్థంలో ‘వెన్నెల’ కిశోర్ ను బేస్ చేసుకుని తీసిన సీన్స్ సరదాగా, బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే… నాగశౌర్య నటనలో మెచ్యూరిటీ కనిపించింది. బిగ్ కాన్ ఫ్లిక్ట్ ఉన్న ఈ క్యారెక్టర్ ను చాలా ఈజ్ తో చేశాడు. అటు భార్యను, ఇటు తల్లిని కన్వెన్స్ చేసే సీన్స్ లో చక్కగా నటించాడు. కొత్త అమ్మాయి షిర్లీ సెటియా అందంగా ఉండటమే కాకుండా ఆకట్టుకునే నటన కనబరిచింది. ఆమె పోషించింది ఉత్తరాది అమ్మాయి పాత్ర కాబట్టి సొంత డబ్బింగ్ తో బాగానే మేనేజ్ చేసింది. హీరో తల్లిదండ్రుల పాత్రలను రాధిక, జయప్రకాశ్ పోషించారు. బ్రాహ్మణ వనితగా రాధిక ఆహార్యం బాగున్నా… ఆమె వాయిస్ సెట్ కాలేదు. వేరెవరితో అయినా డబ్బింగ్ చెప్పించాల్సింది. హీరో స్నేహితులుగా సత్య, రాహుల్ రామకృష్ణ; అక్కబావలుగా శరణ్య, బ్రహ్మాజీ; డాక్టర్ గా ‘వెన్నెల’ కిశోర్ చక్కగా సెట్ అయ్యారు. నాయనమ్మ పాత్రను అన్నపూర్ణమ్మ, హీరోయిన్ స్నేహితురాలిగా హిమజా నటించారు. మరో కీలకమైన పాత్రను ‘బ్రూస్ లీ’ ఫేమ్ అమితాష్ ప్రధాన్ చేశాడు. దర్శకుడు అనీశ్ కృష్ణ రాసిన మాటలు బాగున్నాయి. సంగీత దర్శకుడు మహతీ స్వర సాగర్ స్వరపరిచిన పాటల్లో హీరో ఇబ్బందులను తెలియచేస్తూ ద్వితీయార్థంలో వచ్చిన పాట బాగుంది. నేపథ్య సంగీతంతో సీన్స్ ను ఎలివేట్ చేశాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలుగా ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఎక్కడా రాజీ పడని విషయం స్క్రీన్ మీద తెలుస్తోంది. థియేటర్ లో కూర్చుని సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
ఆకట్టుకునే వినోదం
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
బలహీనమైన కథ
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
అనవసర పోరాట దృశ్యాలు
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్: వినోద విహారి!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!