పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని, అవసరం అయితే జైలుకు పంపిస్తాం అని కార్యకర్తలతో అన్నారు. కొందరు తాము బీజేపీ అంటూనే.. బీజేపీ నేతల మీదనే పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వంను అస్సలు చంపుకోవద్దని సోషల్ మీడియా, యూట్యూబ్ వారికి రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు.…
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్‌లు ఆటంబాంబుల్లా రీసౌండ్‌నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా? జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కని పార్టీ… లోక్‌సభ ఎన్నికల నాటికి అనూహ్యంగా పుంజుకోవడాన్ని ఎలా చూడాలి? అసెంబ్లీకి ఒకలా, పార్లమెంట్‌కు మరోలా తీర్పునిచ్చిన ఓటర్ల మైండ్‌సెట్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఆ విషయంలో కాషాయదళం ధీమా ఏంటి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. కానీ… ఇప్పటిదాకా ఎప్పుడూ భారీగా పోలింగ్ నమోదైన దాఖలాలు లేవు. 50 శాతానికి కాస్త…
తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు రేగుతున్నాయా? పట్టుమని పది నెలలు కూడా గడవకుండానే… జిల్లాల కొత్త అధ్యక్షులను మార్చుకోవాల్సి వస్తోందా? ఈ అధ్యక్షుడు మాకొద్దు మహాప్రభో అని ఏయే జిల్లాల కేడర్ అంటోంది? అసలు ఇప్పుడా మార్పు చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో. ఇప్పుడు తప్పు ఆ అధ్యక్షులదా? అలాంటి వాళ్ళని నియమించిన పార్టీ పెద్దలదా? వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పైకి మాత్రం అది రాజీనామాలా కనిపిస్తున్నా… అధ్యక్షుడే చేశారని చెబుతున్నా… ఇన్సైడ్ మేటర్…
క్రమశిక్షణకు కేరాఫ్ అని ఢంకా బజాయించే బీజేపీలో ఆ పరిస్థితులు మారిపోతున్నాయా? కీచులాటలకు కేరాఫ్ అవుతోందా? ఎక్కడికక్కడ జిల్లాల్లో లొల్లి పెరిగిపోతోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు, బలం, జనంలోకి వెళ్లే సంగతులు ఎలాఉన్నా… క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్…
తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్‌ని చూడబోతున్నామా? ఇప్పుడిప్పుడే ఒక డిఫరెంట్, ఇప్పటి వరకు అసలు ఊహకు కూడా అందని వాతావరణం నెలకొంటోందా? ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ప్రస్తుతం బీజేపీ రాడార్ పరిధిలో ఉన్నారా?
MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న…
తెలంగాణ కమలం నేతలకు నివాస గండం పొంచి ఉందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా… పార్టీ పదవులు ఎందుకు రావడం లేదు? అధికార ప్రతినిధుల నియామకం ఆలస్యానికి కారణం ఏంటి? పార్టీ పోస్ట్‌లకు, నేతల నివాసాలకు లింక్ ఏంటి? కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని ప్రకటించి చాలా రోజులవుతోంది. అప్పట్లో దానిమీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అన్ని వర్గాలకు సమన్యాయం జరగలేదన్న అసంతృప్తులు కూడా వెలువడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న…
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు.
Telangana BJP State Committee Announcement: తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు), 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌ను నియమించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి.. ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్,…