BJP Door to Door: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర బీజేపీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. మహా జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. రాష్ట్రంలో ప్రతిరోజూ 35 లక్షల కుటుంబాలను కలువనున్నారు బీజేపీ నేతలు. ఇవాళ పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వరకు అందరూ ఈరోజు తమ నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా, ఒక్కో బూత్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రంలో కనీసం వంద కుటుంబాలను కలుస్తారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు.
Read also: China: చైనాలో ఘోర ప్రమాదం.. రెస్టారెంట్‌లో ఎల్‌పిజి లీక్.. 31 మంది దుర్మరణం..
కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లోని ప్రజలను బండి సంజయ్ కలుస్తూ నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ.. కరపత్రాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి, వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటిపై ప్రత్యేకంగా ముద్రించిన స్టిక్కర్లను అతికించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తారన్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పర్యటించనున్నారు. ఈ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన మేలు గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేయనున్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తమ తమ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు.
Mouth Ulcer: తులసి, కొత్తిమీరతో నోటి అల్సర్ మాయం