Bandi Sanjay: పోలీసులతో బెదిరిస్తామనే నమ్మకంతో ఖమ్మం లీడర్లు ఉన్నారని.. బీఆర్ఎస్ పోటుగాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు కాక ముందే వారి చరిత్ర తెలుసని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో ఈ రోజు నిరుద్యోగ నిరసన మార్చ్ ని బీజేపీ చేపట్టింది. బండిసంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీతారామ ప్రాజెక్టు కాలేదని, గోదావరి జలాలు రాలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ నేనే పెద్ద హిందువు అని అంటారు.. భద్రాచల రాముడికి తలంబ్రాలు తీసుకుని రాలేదని ప్రశ్నించారు. కరకట్ట నిర్మాణానికి వెయ్యి కోట్లు ఇస్తానని అన్నాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.
Read Also: Ashwini Vaishnaw: 6 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
టీఎస్పీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఐదు నెలల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీని మార్చకుండా మళ్లీ పరీక్షలు జరిగితే సహించేది లేదని, బండి నరేంద్రమోదీ శిష్యుడు, అమిత్ షా అనుచరుడు అంటూ కామెంట్ చేవాడు. ప్రజల కోసం నెలకు ఒకసారి జైల్ కు వెళ్లేందుకు సిద్దం అని, ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు. ప్రభుత్వం సర్పంచుల ఉసురు పోసుకుంటోందని, 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వాన్ని పాతిపెట్టాలని ప్రజలను కోరారు. బీజేపీని తగ్గించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అనుకూలంగా పత్రికలు వార్తలు రాస్తున్నాయని, ఎవ్వరు ఏం రాసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.