Ashwini Vaishnaw: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల 2014 నుంచి దేశ సామాజిక, ఆర్థిక పరివర్తనకు దారి తీశాయని, రెండేళ్లలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపిస్తోందని, ప్రపంచం మొత్తం భారత్ పై విశ్వాసాన్ని ఉంచుతోందని ఆయన శనివారం అన్నారు. 2047 వరకు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు విశ్వాసాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిదేళ్ల సందర్భంగా జరిగిన జాతీయ సదస్సులో రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి వైష్ణవ్ మాట్లాడారు.
Read Also: Eric Garcetti: ఇరానీ చాయ్ టేస్ట్ చూసిన అమెరికా రాయబారి.. హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని ప్రశంసలు
2014లో ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత దేశం 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, రెండేళ్లలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. వచ్చే 6 ఏళ్లలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింస్తుందని ఆయన వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాలు పేదలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవని, 2014 నుంచి ప్రభుత్వ పథకాలు ప్రజల సాధికారతకు దారి తీశాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు స్కామ్ లకు పర్యాయపదాలుగా మారాయని, ప్రస్తుతం ప్రతీ పైసా పేదలకు చేరుతుందని, సమాజంలో పేద, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పథకాలు, కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ ను సకాలంలో తీసుకువచ్చానమని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. రహదారి, విమాన, రైల్వే మౌళికసదుపాయాలను మెరుగురిచామన్నారు. నేడు దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇళ్లు నిర్మించబడ్డాయి, 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు ఉన్నాయి మరియు 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందించబడ్డాయని వెల్లడించారు.