Bandi Sanjay Comments In Vardhannapeta: బీఆర్ఎస్‌ను తరిమికొడదాం, రామరాజ్యం స్థాపించుకుందామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నినదించారు. వర్దన్నపేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వర్ధన్నపేట ప్రజలు ప్రతిభావంతులని, అందుకే సీలింగ్ పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేసిన వాళ్లకు జీవో వెనక్కి వచ్చిందని అన్నారు. ఉద్యోగాల పేరుతో కేసీఆర్ సర్కార్ కాలయాపన చేస్తోందని, ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మన డబ్బులతో రూ.100 కోట్లతో కేసీఆర్ బిడ్డకు లిక్కర్ దందా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కరెంట్ బిల్లు కట్టలేదని 6 నెలలుగా గిరిజనులను చీకట్లోనే ఉంచుతారా? అని ప్రశ్నించిన ఆయన.. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల బకాయిలున్నాయని, మరి అక్కడెందుకు కరెంట్ కట్ చేయడం లేదని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో రూ.20 వేల కరెంట్ బకాయిలున్నయని.. మరి వాళ్లకో న్యాయం? పేదలకో న్యాయమా? అని అడిగారు. 50 గ్రామాలకు వాడే కరెంట్‌ను.. తన ఫాంహౌస్‌లో కేసీఆర్ ఫ్రీగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Harry Brook: హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపురించాడని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిప్పలు కడిగి వచ్చినోడు.. ఇక్కడ అయ్య పేరు చెప్పుకుని పదవి తెచ్చుకున్నాడని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫస్ట్ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలియ్యలేని దుస్థితి కేసీఆర్‌ది అని విమర్శించారు. రుణమాఫీ, దళిత బంధు సహా ఏ పథకం అమలు చేయాలన్నా పైసల్లేవని చెప్తున్న కేసీఆర్.. ఆయన బిడ్డ దొంగసారా, పత్తాల దందాకు మాత్రం వందల కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. పైసలు పడేస్తే పేదోళ్లు ఓట్లేస్తరనే చులకన కేసీఆర్‌ది అని చెప్పారు. బీఆర్ఎస్ నేతల భూముల కబ్జాకు, ఇసుక దందాలకు అంతే లేదని.. వందల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. చివరికి రైతుల భూముల్ని కూడా లాక్కుంటున్నారని, ప్రశ్నిస్తే బేడీలు వేసి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. వరంగల్‌లో ప్రీతి అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేస్తే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చనిపోతే కూడా స్పందించలేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Srinivas Goud: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులవృత్తులను అవమానిస్తున్నారు