Harish Rao: సీఎంకు హరీష్ రావు మరో లేఖ.. అందులో ఏముందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు మరో సారి లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నారన్నారు. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదన్నారు.
Read also: Chandrababu: నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర.. షెడ్యూల్ ఇదే!
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలు తో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
Read also: Gunfire : ఫిన్ లాండ్ పాఠశాలలో కాల్పులు.. చిన్నారి మృతి, ఇద్దరికి గాయాలు
కెసిఆర్ గారి నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు లక్ష రూపాయల చొప్పున 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఏ ఓక్క బ్యాంకు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు. లక్ష రూపాయల వరకు రైతులకు సంబంధించిన రుణాలను మేమే కడతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణమాఫీ పొందగలిగారు. కానీ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్ లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.
Read also: Pawan Kalyan: ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్.. డ్రైవర్‌ల సమస్యలపై ఆరా!
రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ అనిశ్చితి.. గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతున్నది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారని తెలిపారు.
Read also: Hyderabad Crime: సికింద్రాబాద్ లో దారుణం.. పక్కకు జరగమంటే ప్రాణాలే తీశారు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక, ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నానని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తు చేశారు..
Read also: Sudheer: టీవీ అయిపోయింది.. ఇక ఓటీటీ మీద పడ్డ ‘సుధీర్’..!
తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు 70 శాతం వరకు ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను గోస పెట్టడం ఏమాత్రం సమ్మతం కాదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాట మీకు నేను గుర్తు చేయాల్సిన అవసరంలేదు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించే విధంగా.. మీరిచ్చిన హామీలన్నిటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తున్నానని లేఖలో తెలిపారు.
Summer: మధ్యాహ్నం బయటికి రావొద్దు.. ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!