బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో ప్రజలను కడుపుబ్బ నవ్వించి ఆపై తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు వెండి తెరపై హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. ఇకపోతే తాజాగా ఈ స్టార్ కమెడియన్ కం హీరో ఓటీటీ ‘ఆహా’ లో ప్రసారమయ్యే సర్కార్ షో కి యాంకరింగ్ చేయబోతున్నాడు. సెలబ్రిటీలపై ప్రశ్నలు కురిపిస్తూ.. వినోదాన్ని పంచె ఈ రియాల్టీ షో త్వరలో నాలుగో సీజన్ మొదలు కాబోతోంది. దీనికి గాను కొత్త హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ను అనౌన్స్ చేసింది. సోషల్ మీడియా ద్వారా ఆహా ఈ విషయాన్ని తెలియజేసింది.
Also read: CM Kejriwal : సీఎం కేజ్రీవాల్ బ్యారక్ పక్కన ఎవరెవరు గ్యాంగ్ స్టర్లు ఉన్నారంటే ?
ఇకపోతే ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో విజయవంతంగా సాగుతున్న రియల్ షో ‘సర్కార్’. ఈ రియల్ షోకు ఇదివరకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. కాకపోతే ఈ సీజన్ కు మాత్రం హోస్ట్ గా సుడిగాలి ‘సుధీర్ చేయబోతున్నాడు. ఇక అతి త్వరలోనే ఈ కొత్త సీజన్ మొదలు కాబోతోంది. సుధీర్ తనదైన స్టైల్ లో నవ్వులు పూయించి ఎదుటివారిని సంతోషపరచడంలో దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం అనుసరించి సుడిగాలి సుధీర్ సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఆహా ఆ బాధ్యతను సుధీర్ కి అప్పగించింది. ఈ షో 2021లో మొదలైంది.
Also read: Ayalaan Telugu OTT: అయలాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ షో సంబంధించి గత సీజన్ లో సాయి పల్లవి, సిద్దు జొన్నలగడ్డ, రానా, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, ప్రియమణి, సైనా నెహ్వాల్, కశ్యప్ లాంటి సెలబ్రిటీలు ఈ షో కి వచ్చారు. ఈ నాలుగో సీజన్ లో భాగంగా ఎటువంటి స్టార్ హీరో హీరోయిన్లు వస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ప్రకటించిన సీజన్ సంబంధించి స్ట్రీమింగ్ తేదీలు అలాగే సెలబ్రిటీల లిస్ట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ మా, జి తెలుగు లాంటి అనేక ఛానల్ లో హోస్ట్ గా ఉంటూ ప్రస్తుతం ఓటీటీలోకి కూడా ఎంటర్ అయ్యాడు ఈ బిజీ కమెడియన్ స్టార్.
కొత్త సర్కార్, సుడిగాలి లాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు!😎
ఇక ఆట మొదలెడదామా 🤟🏻 @sudheeranand #SarkaarS4 #Sudheer #SudigaliSudheer #SudheerSarkaar #SarkaarOnAHA #SarkaarGameShowOnAHA @mostbet_india pic.twitter.com/Td86jBHEBa— ahavideoin (@ahavideoIN) April 2, 2024