ఫోన్లకూ చెవులుంటాయంటే మీరు నమ్ముతారా? చాలా మంది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారు. కానీ.. ఇప్పుడు మేము చెప్పిన వివరాలు విన్నతర్వాత తప్పకుండా అంగీకరించాల్సిందే. మనం ఏదైనా ఒక ప్రాడెక్ట్ గురించి వేరేవాళ్లతో చర్చిస్తే.. ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన ఆడ్ మన ఫోన్లో వస్తుంది. ఇది ఎలా వస్తుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. మీరు వేటి గురించి అయితే ఫోన్లో చర్చిస్తారో ఆ ప్రోడక్ట్స్ మీకు చూపించడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆ కంపెనీలు ఉపయోగిస్తాయట. అందుకే మనం దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుంటామో వాటికి సంబంధించిన అడ్వటైజ్మెంట్స్ మన మొబైల్ ఫోన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఫోన్లో అమర్చబడినటువంటి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ మన మాటలను అర్థం చేసుకొని.. మనం ఏం కావాలనుకుంటున్నామో గ్రహించి వాటికి సంబంధించిన డేటా మనకు ఎక్కువగా కనిపించేలా చేస్తుంది.
READ MORE: MP: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి
దీనికి సంబంధించి టెక్ నిపుణుల ప్రకారం.. మనం ఫోన్లో ఏదైనా ఆప్ కి సంబంధించి పర్మిషన్ ఇచ్చేటప్పుడు.. మైక్రోఫోన్ పర్మిషన్ ని కూడా మనం ఆక్టివేట్ చేస్తాం. అయితే చాలా సందర్భాలలో మనం ఉపయోగించే యాప్ కు మైక్రోఫోన్ వాడకం అవసరం ఉండదు. ఈ విషయాన్ని గమనించకుండా గుడ్డిగా పర్మిషన్ ఇచ్చేస్తాం. అందుకే మన మొబైల్ ఫోన్స్ మనం మాట్లాడకుండా పక్కన పెట్టేసినా.. మన మాటలు వింటాయి. వీటికి సంబంధించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఫోన్లో ఏర్పాటు చేసి ఉంటారు.
READ MORE: Kaushik Reddy: డీసీపీ, ఏసీపీ లను సస్పెండ్ చేస్తేనే కంప్లైంట్ ఇస్తా.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజాగా స్మార్ట్ ఫోన్ డేటా గోప్యతపై 404 మీడియా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది. యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీ సహాయంతో మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ మనం మాట్లాడే మాటలను గోప్యంగా వింటున్నాయి. అయితే మన డేటా ప్రైవసీ మన చేతుల్లోనే ఉంది.. మీరు ఏదైనా కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చే సమయంలో సదరు యాప్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయించుకోండి. అంతేకాదు కొన్ని మొబైల్ ఫోన్స్ మీకు తెలియకుండా మీ ఫోటోలను కూడా తీస్తూ ఉంటాయి. కాబట్టి మీ సెల్ క్యాం ఎప్పుడు కూడా కవర్ అయి ఉండేలా చూసుకోండని మీడియా తెలిపింది.