Vivo V50e: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ vivo V50e ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అద్భుత పనితీరును అందించేందుకు ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మొబైల్ లో vivo V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 4500 nits వరకు ఉండటంతో ప్రకాశవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. HDR10+ మద్దతుతో ఫొటోలు, వీడియోలు మరింత ఆకట్టుకునేలా కనిపిస్తాయి.
ఈ ఫోన్‌లో ప్రధాన కెమెరాగా 50MP Sony IMX882 సెన్సార్ ఉంది. దీనికి తోడుగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా 2x పోర్ట్రెయిట్ మోడ్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50MP ఐ ఆటో ఫోకస్ గలదిగా ఉండటంతో సెల్ఫీలు, వీడియో కాల్స్ స్పష్టంగా ఉంటాయి. వీటితోపాటు ఐపా లైట్, స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, వివాహ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెంసిటీ 7300 4nm చిప్‌సెట్ ఉంది. ఈ మొబైల్ లో 8GB LPDDR4X RAM తోపాటు అదనంగా 8GB వర్చువల్ RAM కూడా ఇవ్వబడింది. 128GB / 256GB స్టోరేజ్ అనే రెండు ఆప్షన్లలో లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15 పై రన్ అవుతుంది.
ఇక ఈ వివో V50e లో 5600mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా ఫోన్‌ను తక్కువ సమయంలో వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ రెండు కలర్స్‌లో లభిస్తుంది. సాఫైర్ బ్లూ (ఇరిడిసెంట్ షేడ్‌తో), పెర్ల్ వైట్ (లిక్విడ్ షిమ్మర్ ఇన్స్పైర్డ్ డిజైన్‌తో) లభించనుంది. అలాగే ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. అంటే ఇది నీరు, ధూళి నుండి పూర్తిగా రక్షణ కల్పించగలదు. డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో ఇది మరింత బలంగా నిలుస్తుంది. ఇక ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో, 5G, Wi-Fi 6, Bluetooth 5.4, Smart AI ఫీచర్లు AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, 3 సంవత్సరాల Android అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి.
ఇక ధరల విషయానికి వస్తే.. 8GB + 128GB మోడల్ ధర రూ.28,999, 8GB + 256GB మోడల్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా స్టోర్, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ అమ్మకాలు మాత్రం ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక వీటిపై HDFC, SBI కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 10% ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందనుంది.