చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు iQOO Z10, iQOO Z10xని విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో లభించనున్నాయి. iQOO Z10 7300mAh భారీ బ్యాటరీతో వస్తోంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద డిస్ప్లేను కలిగి ఉన్నాయి. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండగా, మరొకటి మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. iQOO Z10x మీడియం రేంజ్ లో ప్రారంభించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,499. దీనిని ఏప్రిల్ 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. iQOO Z10 సేల్ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read:Anchor Ravi: నేను క్షమాపణ చెప్పను.. టీవీ షో వివాదంపై యాంకర్ రవి! ఆడియో వైరల్
iQOO Z10, Z10x ధర
iQOO Z10 8GB + 128GB మోడల్ ధర రూ.21,999. దీని 8GB + 256GB మోడల్ ధర రూ.23,999. కంపెనీ 12GB + 256GB మోడల్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ధర రూ. 25,999. స్టెల్లార్ బ్లాక్, గ్లేసియర్ సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. iQOO Z10x 5G 6GB + 128GB మోడల్ ధర రూ.13,499. 8GB + 128GB మోడల్ ధర రూ.14,999. దీని 8GB + 256 GB మోడల్‌ను రూ.16,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ టైటానియం, అల్ట్రామెరైన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన ICICI, SBI కార్డులపై రూ.2,000 తగ్గింపు పొందవచ్చు.
Also Read:IDBI: ఐడీబీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్.. భారీగా జీతం.. అర్హులు వీరే!
iQOO Z10 స్పెసిఫికేషన్లు
iQOO Z10 లో 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంది. డిస్ప్లే120 Hz రిఫ్రెష్ రేట్, 5,000 nits బ్రైట్ నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7S Gen3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో LPDDR4X RAM అందించారు. iQOO Z10 లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ముందు కెమెరా 32 మెగాపిక్సెల్స్. iQOO Z10 లో 7300 mAh బ్యాటరీ ఉంది. ఇది 90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ Funtouch OS 15, Android 15 OS తో పనిచేస్తుంది.
Also Read:CSK Captains: ధోనీ టు రుతురాజ్.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే
iQOO Z10x కీ ఫీచర్లు
iQOO Z10x 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. iQOO Z10x మీడియాటెక్ యొక్క డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.