గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ అవిశ్వాస పరీక్షకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ కండువా కప్పేసుకోవడానికి సిద్ధం అయ్యారు. గాజువాక ప్రాంతానికి చెందిన వంశీ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. పార్టీ మారడం ఆసక్తికర పరిణామం.
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..
సీఐడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరిపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మేం కనుక నీ భాష ఉపయోగిస్తే.. సాయంత్రానికి నువ్వుండవు గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు.. కారుమూరి నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుంది అంటూ హాట్ కామెంట్లు చేశారు..
నిన్న మాధవ్.. నేడు యాదవ్… సీఐ రూట్లోనే ఎస్సై కూడా ఖాకీ వదిలేసి ఖద్దర్ తొడగాలనుకుంటున్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఎస్సై సుధాకర్ యాదవ్ డైరెక్ట్ అటాక్‌కి… బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగానే వినిపిస్తోందా? ఆయనకు రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అసలు సుధాకర్ యాదవ్ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎన్ని రోజులని ఇలా… ఖద్దరు చెప్పినట్టు వింటాం…… వాళ్ళకు సలాం కొడతాం…. ఆ ఖద్దరేదో మనమే వేసుకుంటే పోలా? రూలింగ్‌లోకి వస్తే……
ఈసారి కచ్చితంగా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. జగన్ 2.O పాలనలో మీకు కావాలనుకుంటున్న విధంగా జగన్ ను చూస్తారంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ పాత బీహార్ లా తయారైందని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే... యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.
ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు..
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన…