ఒక్క కేసు కాదు.. ఇలాంటివి మరో 100 కేసులు పెట్టిన నేను భయపడే వ్యక్తిని కాను అని స్పష్టం చేశారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. తనపై కేసులు పెట్టడంపై స్పందించిన ఆయన.. నాపై వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమ.. మీ తప్పుల్ని ఎత్తి చూపుతూనే ఉంటా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటా.. తప్పుడు కేసులు పెట్టడం వల్ల భయపడిపోతాం అనేది మీ…
GVMC Mayor: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు.
మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (ఏప్రిల్ 18న) విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతడిని సిట్ కోరింది.
లిక్కర్ స్కాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్.. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇక, ఇదే కేసులో రేపు విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే..
ఎస్వీ గోశాల వివాదం టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పెంచింది... అసత్య ప్రచారం చేసిన వైఎస్ జగన్ రేపు ఉదయం ఎస్వీ గోశాలకు రావాలి.. వచ్చి అక్కడి పరిస్థితి నేరుగా చూడవచ్చు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరింది... అయితే టీడీపీ సవాల్ కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.. రేపు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దాం అంటూ ప్రకటన విడుదల చేశారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదన్నారు. పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అతడు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.. దోపిడీలు దొంగతనాలు తప్పుడు కేసులు పెట్టించడంలో కాకాణి నెంబర్ వన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు.