JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డైరెక్టర్ అంటే బోయపాటి మాత్రమే. ఆయన తెరకెక్కించే యాక్షన్ సీక్వెన్స్‌లకు థియేటర్లు దద్దరిల్లాల్సిందే. గతేడాది చివర్లో అఖండ 2 తో పలకరించిన బోయపాటి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. అయితే ఆయన నెక్స్ట్ సినిమా ఏంటనే దానిపై గత కొంత కాలంగా సస్పెన్స్ నెలకొంది. తమిళ్ హీరోతో ఉంటుందని బాలీవుడ్ హీరోతో ఉందని న్యూస్ వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ చిత్రం ‘జాట్’ సీక్వెల్ బాధ్యతలను బోయపాటి చేపట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సమాచారం.
Also Read : Shocking Reveal : రష్మిక బ్రేకప్ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి బోయపాటి శ్రీను ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు, బోయపాటి మార్క్ ఊర మాస్ యాక్షన్ తోడైతే వెండితెరపై రక్తాభిషేకం గ్యారెంటీ అని మాస్ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఈ కథపై కసరత్తు చేస్తున్నారని, సన్నీ డియోల్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. బాలీవుడ్ మరియు టాలీవుడ్ కలయికలో రాబోయే ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!