Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ భూముల్లోనే అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణం కోసం డిజైన్ కూడా రెడీ చేయడం జరిగిందన్నారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదు అని ఆరోపించారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రీ టెండర్లను పిలిచామని పేర్కొన్నారు. రాజధానికి 92 పనులు, 64 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి.. దీంతో రాజధానికి గ్రావెల్ కావాలి.. మైన్స్ సీఆర్డీఏకు 851 ఎకరాలు ఇచ్చింది అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో మొదటి ఆటగాడిగా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!
ఇక, రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలి అని మంత్రి నారాయణ తెలిపారు. మైన్స్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంది.. అనంతపురంలో ఉన్న మైన్స్ కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తాం.. అయితే, గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బంది ఏర్పడింది అన్నారు. అలాగే, సీఎం చంద్రబాబు రాబోయే వందేళ్ళ కోసం ఆలోచిస్తారు.. రాజధాని అమరావతి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.. ల్యాండ్ పూలింగ్ కు ఇష్టపడుతున్నారని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.. అమరావతిలో ఎయిర్ పోర్టును దృష్టిలో పెట్టుకుని భూ సేకరణ చెయ్యాలా.. సమీకరణ చెయ్యాలా అనేది దృష్టి పెడుతున్నాం.. ముందు భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్స్ ఇస్తామని పొంగూరు నారాయణ వెల్లడించారు.