Thopudurthi Prakash Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామ సమీపంలో హెలిప్యాడ్ దగ్గర జరిగిన ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ లీడర్స్, కేడర్‌కు గడ్డు కాలం నడుస్తోంది. కొన్ని చోట్ల కేడర్‌కు అండగా ఉండాల్సిన లీడర్స్ సేఫ్ జోన్స్ చూసుకుంటుంటే... గతంలో వాళ్ళనే నమ్ముకుని చెలరేగిపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారట. డైరెక్ట్‌గా అలాంటిది కాకున్నా... దాదాపుగా అదే తరహాలో, ఇంకా చెప్పుకోవాలంటే ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కార్యకర్తలు. రాయదుర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్, టిడిపి సమఉజ్జీలుగా ఉండేవి.
వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు
ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు..
Ambati Rambabu: అమరావతి పునః ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి ఒక అంతులేని కథ.. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు అని మండిపడ్డారు.
గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. కానీ... తమకు పూర్తి మెజార్టీ ఉన్న చోట ఆ పరిస్థతి ఎందుకు వచ్చిందన్న అంతర్మధనం జరుగుతోందట వైసీపీలో. తమకు వెన్నుపోటు పొడిచిన ఆ కట్టప్ప ఎవరంటూ లోకల్ లీడర్స్ ఆరా తీస్తున్నారట. జీఎంసీలో మొత్తం 57డివిజన్లు ఉంటే.... అందులో వైసీపీ 46, టీడీపీ 9, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి.
పార్టీ రీఛార్జ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కింది స్థాయి నుంచి కీలకమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలు, జిల్లా అధ్యక్షులతో మీటింగ్‌లు నడుస్తున్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవుల్ని సైతం భర్తీ చేస్తున్నారు. ఇలా... అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగా పార్టీ యాక్టివిటీ నడుస్తుండటంతో.. ఏదో.. ఉంది, ఏం జరుగుతోందన్న అమమానాలు మొదలయ్యాయట రాజకీయ వర్గాల్లో.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది.. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో... ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు.. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి.. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు..