Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
- యుద్ధం ముగింపునకు ముందుకొచ్చిన ఇరాన్
- ప్రపంచ దేశాల ముందు 3 షరతులు పెట్టిన ఇరాన్
- ఎక్స్‌లో తెలియజేసిన ఇరాన్ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. దీంతో యుద్ధం ముగింపునలకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపునకు ఇరాన్ ముందుకొచ్చింది. అయితే యుద్ధం ముగింపునకు ఇరాన్ మెలిక పెట్టింది. యుద్ధం ముగింపునకు ప్రపంచం ముందు 3 షరతులు పెట్టింది. వాటికి అంగీకరిస్తే యుద్ధం ముగిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
మొదటి షరతు.. ఇరాన్ హక్కులను గుర్తించాలి.
రెండో షరతు.. యుద్ధానికి పరిహారం చెల్లించడం.
మూడో షరతు… భవిష్యత్ దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ హామీలు ఇవ్వడం. ఈ మూడు షరతులకు అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేశారు.
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మూడు షరతులను విధించింది. ఈ షరతులపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way to end this war—ignited by the Zionist regime & US—is recognizing Iran’s legitimate rights, payment of reparations, and firm int'l guarantees against future aggression.
— Masoud Pezeshkian (@drpezeshkian) March 11, 2026
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?