పీఏసీ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత జగన్.. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం.. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది.. విశాఖలో 3వేల కోట్ల భూమిని ఊరుపేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు.
లిక్కర్ స్కామ్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ''ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను''
ఏపీ పాలిటిక్స్‌లో తాజా ట్రెండింగ్ లీడర్... వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక... కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది.
YS Jagan: రేపు (ఏప్రిల్ 22వ తేదీన) తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది.
AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్... విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన…
సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.
మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.