బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్‌గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్…
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు..
వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత.... నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ... ఆ దిశగా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు టీడీపీ నాయకులు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్‌కు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే కేసు బుక్ అయింది.
YS Jagan: రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ.. మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు..
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. చేతికి వచ్చిన ఎన్నో పంటలు దెబ్బతినడంతో.. రైతులు గగ్గోలు పెడుతున్నారు.. అయితే, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో భారీ వర్షాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు,…
Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.