YS Jagan: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నేడు జగన్ భేటీ.. తర్వాత బెంగళూరుకు..!
- వైసీపీ నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ వరుస భేటీలు..
- నేడు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశం..
- సాయంత్రం బెంగళూరు వెళ్లనున్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఇవాళ తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో భేటీకాబోతున్నారు.. వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.. ఇటీవల అవిశ్వాస తీర్మానాలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్..
Read Also: Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
మరోవైపు.. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బుధవారం రోజు వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. నిన్న పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించిన జగన్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేసిన విషయం విదితమే..
Read Also: Jammu Kashmir: ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు.. కీలక వస్తువులు స్వాధీనం!
మరోవైపు.. ఇవాళే బెంగుళూరు వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. సాయంత్రం 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.. ఇక, రాత్రి 8.00 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!