ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా.. పాకిస్తాన్ అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. సంపద సృష్టిస్తామని అన్నారు కదా.. ఇప్పుడు ఏమి అయ్యింది? అని ప్రశ్నించారు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే కొందరు, ఆ తర్వాత మరి కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. కానీ.... ఇంతవరకు ఒక్క రాజీనామా కూడా మండలి ఛైర్మన్ ఆమోదం పొందలేదు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి బైబై చెప్పేశారు.
ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట్లో కాస్త నత్త నడకన నడిచినా..... ఎప్పుడైతే...మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దానికి సంబంధించిన టిప్ ఇచ్చారో... ఆ తర్వాతి నుంచి ఇక దూకుడు పెంచింది సిట్. లిక్కర్ స్కాంలో కర్త.. కర్మ.. క్రియ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన చెప్పటం.. ఇక సిట్ అధికారులు ఆయనతో మొదలు పెట్టి భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వరకూ అరెస్టులు చేయటం…
క్షవరం అయితే గానీ.... వివరం తెలియదని అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేవలం టింకరింగ్తో సరిపోదని, టాప్ టు బాటమ్ పార్టీని రీ స్ట్రక్చర్ చేయాలని అధిష్టానం డిసైడైందట.
సరిహద్దులో భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగినా.... బెజవాడలో బ్రదర్స్ వార్ మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా పీక్స్‌కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంతో... మేటర్ మాంఛి రసకందాయంలో పడింది.
బాపట్ల జిల్లా.... అద్దంకి నియోజకవర్గం అంటేనే వర్గ రాజకీయాలకు కేరాఫ్. ఒకప్పుడు ఇక్కడ కరణం బలరాం వర్సెస్ బాచిన చెంచు గరటయ్యగా రాజకీయాలు నడిచేవి. ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ కరణం, మరి కొన్నాళ్ళు గొట్టిపాటి వర్సెస్ బాచిన కుటుంబాల పొలిటికల్ పోరు నడిచింది. రవికుమార్ నియోజకవర్గంలో పాతుకుపోవడంతో... ప్రత్యర్ధి ఎవరైనా గొట్టిపాటికి మరోవైపునే డీకొట్టాల్సిన పరిస్ధితి ఏర్పడిందన్నది లోకల్ టాక్.
వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని…
కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు... చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు..
తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో... ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి…