సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి…
ఏపీలో టీడీపీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు కృష్ణాజిల్లా మైలవరం పోలీసులు.. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు.. అసలు కేసు ఎందుకు నమోదు చేశారనే విషయానికి వెళ్తే.. టీడీపీ పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన మైలవరంలో ఆందోళన నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి…
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తిరుగులేని మెజార్టీ ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. శాసన మండలిలో మాత్రం సరైన బలం లేదు అనేది నిన్నటి మాట.. ఎందుకంటే.. మండలిలో సమీకరణాలు మారుతున్నాయి.. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ బలం.. ఇవాళ్టి నుంచి తగ్గిపోనుంది.. ఇదే సమయంలో.. అధికార వైసీపీ బలం పెరగనుంది.. ఇవాళ మండలి నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు.. అందులో.. ఏడుగురు టీడీపీ సభ్యులు కాగా.. ఒకరు వైసీపీ సభ్యులు..…
కరోనా సమయంలో కనీసం ప్రజలకు అందుబాటులో ఉండని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యాస్పదం.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం విడ్డూరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మరోవైపు.. నారా లోకేష్పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…
వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆంగ్లో ఇండియన్ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు.. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.. కాగా, ఈ ఏడాది జనవరిలో టీడీపీకి రాజీనామా చేశారు ఫిలిప్ సి. తోచర్… క్రైస్తవ మతం…
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేతలో.. ప్రతిపక్ష నేతలో.. ఈ విషయంపై తరచూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని అధికార వైసీపీ వేగంగా ప్రయత్నాలు చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో అది వాయిదా పడింది.. ఇక, ఈ మధ్య మళ్లీ తరచూ విశాఖ రాజధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేతలు.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు లోక్సభ స్పీకర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ సభ్యులు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ రఘురామ.. స్పీకర్ను కోరారు.. ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని..…
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్సైట్లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అమరావతి మండలంలోని ఉంగుటూరు గ్రామంలో గల చెరువు మరమ్మతుల విషయంలో వివాదం చెలరేగింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ భర్త సోమశేఖర్పై వైసీపీకి చెందిన రాయపాటి శివ వర్గం కర్రలతో దాడి చేసింది. సోమశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఉంగుటూరులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.