పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఒకవైపు కరోనా, మరోవైపు రైతుల సమస్యలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్న తరుణంలో పెగాసస్ స్పైవేర్ తో గత రెండు రోజుల నుంచి ఉభయ సభలు అట్టుడికిపోతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో విశాఖ స్టీల్ వ్యవహారంపై వైసీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై సభలో వెంటనే చర్చించాలని కోరుతూ రాజ్యసభలో 267 కింద నోటీసులు ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, దిశాచట్టం, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తదితర అంశాలపై చర్చకు అనుమతించాలని నోటీసులో పేర్కొన్నారు.
Read: పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!!
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అపేది లేదని, తమకున్న 100 శాతం వాటాను విక్రయిస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలోనే ఆర్ధికశాఖ సహాయమంత్రి కరాడ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, మిథున్ రెడ్డి కూడా పోలవరంపై కాలింగ్ అటెన్షన్ నోటీసులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరణ అంచనాల అమోదంపై చర్చకు అనుమతించాలని కోరుతూ ఆయన తీర్మానం నోటీసులు ఇచ్చారు.