కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన పోలేదని.. ఈ పాపం చంద్రబాబు ది కాదా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పదేళ్లు నిర్థాక్షణ్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
హంద్రీనీవాకు 40టీఎంసీల సామర్థ్యంతో చేసినందనే అంతో ఇంతో సాగు జలాలు వచ్చాయన్నారు శ్రీకాంత్‌రెడ్డి… గ్రేటర్ రాయలసీమ ప్రయోజనాల కోసం సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారన్న ఆయన.. కానీ, చంద్రబాబు మాత్రం కుళ్ళు కుట్రలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు… ఆనాడు సీమ ప్రాంతవాసుల గోంతు కోస్తే ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించిన ఆయన.. 834 అడుగులు రాకమునుపే నీటిని తోడేసుకుంటే ఎలా…? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. అప్పట్లో టీడీపీ నేతలు గట్టిగా ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని.. ఇష్టానుసారంగా తోడేసుకుంటే ఎవరినో ఒకరిని ఆశ్రయించక తప్పలేదన్నారు.. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన సాగు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న శ్రీకాంత్ రెడ్డి.. మా వాటానే మేం అడుగుతున్నాం తప్ప అదనంగా వాడుకోవాలనే యోచన లేదన్నారు.