వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చింది.. మాపై విమర్శలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ ఉద్యోగాలకు కాలం చెల్లిందని మనసులో మాట పుస్తకంలో చంద్రబాబే చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ఉద్యోగులకు భద్రత కల్పిస్తే సోమరిపోతులు అవుతారని చులకనగా చూసిన చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్‌లో ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు ఎమ్మెల్యే కాకాని.. చంద్రబాబు ఉచ్చులో వామపక్షాలు పడ్డాయని ఎద్దేవా చేసిన ఆయన.. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబుని గతంలో ఎందుకు నిలదీయ లేకపోయారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, నారా లోకేష్ అమెరికాకు వెళ్లి చదువుకోలేక వచ్చేశాడని సెటైర్లు వేసిన ఆయన.. చదువు సంధ్యా లేని లోకేష్.. ఉద్యోగాల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. చదువుకుంటామని అమెరికా వెళ్లిన లోకేష్ అక్కడికి వెళ్లి ఏదేదో చేశారని విమర్శించిన కాకాని.. తన హయాంలో చంద్రబాబు ధాన్యం కొనుగోళ్లల్లో పూర్తిగా విఫలమయ్యారని.. అలాంటి చంద్రబాబు.. వైసీపీని విమర్శిస్తారా..? అంటూ దుయ్యబట్టారు.
Also Read
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!