సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు.. గతంలో ఉన్న జోడు పదవులు విధానానికి గుడ్‌బై చెప్పింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్… నామినేటెడ్ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు పెద్దపీట వేశారు.. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించారు.. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68 పోస్టులు, పురుషులకు 67 పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కట్టబెట్టారు.. పదవులు అలంకార ప్రాయం కాదని.. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని.. 76 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు… 50 శాతం పోస్టులు ఈ వర్గాలకే కేటాయించామని తెలిపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి..
రాష్ట్రంలోని మొత్తం 135 కార్పొరేషన్ చైర్మన్ ల పేర్ల ప్రకటించగా.. వీటిలో దాదాపు 76 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, 59 ఓసీ వర్గానికి చెందిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి… మొత్తం పదవుల్లో 68 పదవులు ప్రత్యేకంగా మహిళలకు కేటాయించగా.. 56 శాతం వెనుకబడిన వర్గాలకు, 50.3 శాతం మహిళకు కేటాయించారు. ఇక, జిల్లాల వారీగా గమనిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, విశాఖ జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, తూర్పు గోదావరిలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు , పశ్చిమగోదావరి జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు. నెల్లూరు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 పోస్టులు, అనంతపురం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు , కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు, కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు కేటాయించారు.