రాజ్యసభకు ఏపీ ప్రత్యేక హోదా సెగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం ఏడేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి.. వెంటనే ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ చేపట్టాలని రాజ్యసభ చైర్మన్‌కు రూల్ 267 కింద నోటీసును అందించారు విజయసాయి.. అయితే, ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు సభాధ్యక్షులు నిరాకరించడంతో.. వెల్‌లోకి దూసుకెళ్లారు విజయసాయి.. ఇక, ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీల సభ్యులు కూడా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో.. సభలో గందరగోళం ఏర్పడింది.. మరోవైపు సభలో సాయి రెడ్డి, ఇతర పార్టీ సభ్యులు వెల్‌లో వెళ్లి ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. మౌనంగా ఆ పరిణామాలను వీక్షించారు.. ఇక, రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో.. రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!