ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.. దీంతో.. హైదరాబాద్‌కు తరిలించి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. కాగా, ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.. ఆ తర్వాత చల్లా రామకృష్ణా రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. చల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. అనంతరం ఆయన భార్యా, కుమారులు, కుమార్తెలను పరామర్శించారు. చల్లా కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు భగీరథ రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్. ఇప్పుడు భగీరథరెడ్డి.. అనారోగ్యంపాలై. ఆస్పత్రిలో చేరారు.