కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు..…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…
ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా నిర్మించే లేఔట్లో భూమిని ఇవ్వలేకుంటే.. దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని నిబంధన విధించింది. లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక,…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల…
భారీవర్షాలతో ఏపీలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో సైతం మునపెన్నడూ చూడనివిధంగా వరదలు పోటెత్తాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం జగన్ పర్యటించారు. అంతేకాకుండా బాధితులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు మాటలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షాలతో సంభవించిన వరదలను మానవ తప్పిదంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, అందుకే…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అయితే వర్షాల కారణంగా భారీ వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అలాగే పలు వరాల జల్లులను కురిపించారు. ఆ తరువాత టీడీపీ నేతలు జగన్ పర్యటపై పలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ…