కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. అంతకుముందు గుడివాడలో వంగవీటి రంగా విగ్రహ ప్రారంభోత్సవానికి వంగవీటి రాధా వెళ్లారు. అనంతరం వల్లభనేని వంశీ, వంగవీటి రాధా కొండాలమ్మ గుడికి వెళ్లగా… రాధాతో పాటు కొడాలి నాని కూడా ఉన్నారు.
కాగా ఆదివారం వంగవీటి రంగా వర్థంతి సభ సందర్భంగా వంగవీటి రాధా, వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. వీరి భేటీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి రంగా విగ్రహానికి రాధా, వంశీ కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం.. రాధా కార్యాలయంలో వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది.