హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో.. కానీ, సినిమా వాళ్లు స్పందించలేదని.. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది కాబట్టి.. ఇప్పటికైనా హీరో నాని వంటి వారు స్పందించినందుకు థాంక్స్ అన్నారు.
ఇక, రాష్ట్రంలో పెట్రోల్ ధరలకు తగ్గించరు.. నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ, ఈ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను మాత్రం తగ్గించింది అంటూ సెటైర్లు వేశారు అనిత.. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.. మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేయించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. ప్రభుత్వం తీరుపై హీరో నాని నోరు తెరిచి స్పందించినందుకు చాలా థాంక్స్ అన్నారు. హీరో నానితో పాటు.. మిగిలిన వారు కూడా సినీ ఇండస్ట్రీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యలపై స్పందించాలని కోరారు.. సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కదా..? ప్రభుత్వం తీరును నాని తప్పుపట్టారని.. వైసీపీ విమర్శిస్తోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు.. హీరో నాని తల్లి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. నిన్నో.. మొన్నో బొత్స సత్యనారాయణ.. అశోక్ గజపతి రాజు తల్లి గురించి ఏదో మాట్లాడారు కదా? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత.
Also Read
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
తాజావార్తలు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!