ఏపీలో సినిమా టిక్కెట్ల ధర విషయంపై అగ్గి రాజుకుంది. హీరో నాని చేసిన కామెంట్లపై ఒకవైపు ప్రభుత్వం విమర్శిస్తుంటే.. మరోవైపు పలువురు ప్రతిపక్షాల నేతలు నానికి మద్దతు పలుకుతున్నారు. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ‘ఏంటో మరి’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
Read Also: హీరో నానికి మంత్రి అనిల్ కౌంటర్.. పవన్ మోజులో పడి చాలా తగలేశా..!
‘నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన వార్తలు అందించడానికి మీ పత్రిక రేట్ పెంచుతారు. సిమెంట్ నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన సిమెంట్ అందించడానికి మీ సిమెంట్ రేటు పెంచుతారు. నాణ్యత ప్రమాణాలు కాపాడటానికి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికి మీ కంపెనీలు అమ్మే విద్యుత్ రేట్ పెంచుతారు. సినిమా హాళ్లలో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి, ప్రజలకు మెరుగైన వినోదపు సేవలు అందించడానికి మరి సినిమా టిక్కెట్ల రేట్ ఎందుకు తగ్గిస్తారు’ అంటూ రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.
ఏంటో మరి! 🤷🏻♂️ pic.twitter.com/8Vrl03h5eA
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) December 24, 2021