పేదలకు మేలు చేసే ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటీఎస్ పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక సంస్కరణ లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ ను తెచ్చారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. పట్టా ద్వారా తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఒక రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ప్రభుత్వం ఓటీఎస్ బలవంతంగా చేయమనడంలేదు. స్వచ్చందగా చేసుకోవాలని పిలుపునిచ్చింది. వడ్డీ, లోను, మాఫీ చేస్తూ ఓటీఎస్ తెచ్చాం. పట్టణాల్లో దీనిపై అవగాహన ఉండటంతో స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. పల్లెల్లో అవగాహన లోపం ను స్వార్ధ రాజకీయాలకు ప్రతిపక్ష నాయకులు వాడుకుంటున్నారు.
ఒకే అబద్ధం 10 సార్లు చెబితే నిజం అవుతుందన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్దాలు నమ్మితే నష్టం తప్ప లాభం ఉండదు. 2014 లో కూడా రుణమాఫీ చేస్తాం వడ్డీలు అప్పులు కట్టవద్దు అని మహిళలకు చెప్పారు. అప్పుడు ఉన్న 14 వేల కోట్ల రుణాలు ఇప్పుడు 25 వేల కోట్లు అయ్యాయి. ఇప్పుడు ఆసరా కింద వైసీపీ సర్కార్ ఆ రుణాలు దశాలవారీగా చెల్లిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.