డీజీపీకి చంద్రబాబు లేఖ.. ఆటవిక రాజ్యం తలపిస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. టీడీపీ సానుభూతిపరులపై పదే పదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ, దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.. వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారన్నారు చంద్రబాబు.
కుప్పం టీడీపీ క్రియాశీల సభ్యుడు మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం 1.55 గంటలకు వైసీపీ నేతలు కుప్పంలో కిడ్నాప్ చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. మురళిని నేరుగా రెస్కో చైర్‌పర్సన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని.. మురళికి కుడి కన్ను దగ్గర అతని ముఖం మీద గాయాలయ్యాయని.. 20 డిసెంబర్ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంథిల్ కుమార్ ఇంటి నుండి రెండు కార్లు, రెండు బైక్‌లలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, కొట్టారని పేర్కొన్నారు.. వైసీపీ నేతల బెదిరింపు కారణంగా మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటనను నివేదించలేదన్న ఆయన.. భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మురళికి భద్రత కల్పించడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని.. పోలీసుల సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతుందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!