పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…
వైసీపీ ప్రభుత్వంపైన, సీఎం జగన్ పైన టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మహిళా ద్రోహి అంతో వంగలపూడి వనిత ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ళుగా సీఎంలో మార్పు వస్తుందని ఆశించామని ఆమె అన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టిన సీఎం జగన్ నేడు గుద్దులు గుద్దుతున్నారని ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతూ మహిళల మెడలోని పుస్తెలు తెంచుతున్నారని, ప్రతి రోజు మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె విమర్శించారు.…
విజయవాడలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటునట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. బాలిక ఆత్మహత్య…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు…
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ…
ఏపీ ప్రభుత్వం ఇటీవల 13 కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి జగన్…
ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ.. గత ఏడాదిలోనే టీడీపీకి రాజీనామా చేశారు శోభా హైమావతి.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు..…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల…