ఏపీ ప్రభుత్వ సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని సెంట్రల్ ఈఆర్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధిక ధరలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, టెండర్ల పై సెంట్రల్ ఈఆర్సీకి పయ్యావుల ఫిర్యాదు చేశారు. అధిక రేటుకు విద్యుత్ కోనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టం పోతుందని, ఇవాళ జరిగిన సెంట్రల్ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణలో పయ్యావుల కేశవ అభ్యంతరాలపై చర్చకు వచ్చాయి.
విద్యుత్ కోనుగోళ్ల అంశంలో పయ్యావుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించిన సెంట్రల్ ఈఆర్సీ చైర్మన్ అన్నారు. సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై 15 రోజుల్లో పిటిషన్ దాఖలుకు పయ్యావులకు సెంట్రల్ ఈఆర్సీ చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఈ రోజు జరిగిన సెంట్రల్ ఈఆర్సీ విచారణలో ఆన్ లైన్ పద్దతిలో పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. గతేడాది నవంబర్ 18న సోలార్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ఈఆర్సీకి లేఖ ద్వారా పయ్యావుల ఫిర్యాదు చేశారు.