జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్…
సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై మాట్లాడేందుకు చిరంజీవి టీం నిన్న సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సమావేశంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో సినిమాటోగ్రఫీ మినస్టర్గా ఉన్నానని, ఆ తరువాతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని ఆయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. నిన్న జరిగింది చూస్తే…
ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్ తెలిపారు. నేడు సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలని, దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలని…
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక…
ఏపీ ప్రభుత్వ సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని సెంట్రల్ ఈఆర్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధిక ధరలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, టెండర్ల పై సెంట్రల్ ఈఆర్సీకి పయ్యావుల ఫిర్యాదు చేశారు. అధిక రేటుకు విద్యుత్ కోనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టం పోతుందని, ఇవాళ జరిగిన సెంట్రల్ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణలో పయ్యావుల కేశవ అభ్యంతరాలపై…
భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రోల్ మోడల్‌గా పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డప్ప… ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.. ఇక, రైతులకు, కౌలుదారులకు ఏడాదికి రూ. 13500 రైతు భరోసా కల్పిస్తున్నారని వెల్లడించారు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర…
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్…సబ్కా సాథ్ కాదు సబ్కా హాత్ అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌ను దుయ్యబట్టిన విజయసాయి రెడ్డి.. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్… కానీ పేషెంట్ డెడ్ అంటూ కేంద్రానికి చురకలు అంటించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ బడ్జెట్ అవుతుందేమోనని ఊహించామని, బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇది ఏ రాష్ట్రానికి…
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతోంది… టీడీపీకి కూడా దీనిపై ఉద్యమానికి సిద్ధం అవుతుంది.. రేపు వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు ప్రకటించారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు.. ఈ సందర్భంగా వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఉమ… రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితులైన కొడాలి నాని, వంశీమోహన్ ద్వారా ఈ జిల్లాకు రంగా పేరు పెట్టాలని…
విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది… విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యులు బోండా ఉమ.. దీని కోసం ఆందోళనకు కూడా సిద్ధం అవుతున్నారు.. రేపు ధర్నా చౌక్ వద్ద రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో వేల మందితో ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు.. అవసరతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమన్నారు.. వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదన్న ఆయన.. రంగా వంటి…