ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ హోల్ సేల్ గా దోచుకుంటుంటే.. ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిలో ముందంజలో ఉన్నారని ఆయన…
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సజ్జల ఉద్యోగుల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో ఈ ప్రభుత్వం కోత విధించడం సీఎం పెద్ద మనస్సుకు నిదర్శనమా? అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. కరెంటు కోతలు వెంటనే నివారించాలని, విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని,…
వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అందజేయనుంది. రజక, నాయీబ్రహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న కానుకను ఈ ఏడాది కూడా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా రూ.285.35 కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు బటన్ నొక్కి లబ్దిదారుల లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని ఏపీ…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో…
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,…
నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసే బీజేపీ నేతలు దేశ ద్రోహులు అని ఆయన ఆరోపించారు. అడవులను అటవీ సంపదను, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, రైల్వే ను విమానాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడా బాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. అదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ కరోనాకు బూస్టర్ వ్యాక్సిన్ తరహాలో ఆశాజనకంగా ఉంటుందని భావించామని.. కానీ అలా లేదని తెలిపారు. పైకి అంకెలు చూడటానికి బాగున్నా బడ్జెట్ అంత ఉపయోగకరంగా అనిపించడంలేదని విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం జరుగుతుందన్నారు. పన్నుల వాటాల్లో ఏపీకి వచ్చేది రూ.4 వేల కోట్లేనని పెదవి విరిచారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 6.4 శాతం ఉండొచ్చని కేంద్రమంత్రి…
చేసిన అప్పులు ఎలా తీర్చాలో జగన్ కు తెలుసని , సీఎంగా వైఎస్ జగన్ 30 సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో నిన్న పర్యాటక, క్రీడ, సాంస్కృతి శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అప్పులు చేయలేదని, కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే ఎక్కువగానే అప్పులు చేశాయన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా…
పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…